గుండె ఆరోగ్యానికి ముప్పు తెచ్చే గురక చిన్న విషయం కాదు,మన చుట్టూ గురకపెట్టే వాళ్లని మనం చూస్తూ ఉంటాము,కొంతమంది చాలా ఎక్కువ గురక పెడుతుంటారు,మరి కొంతమంది చాలా చిన్న శబ్దంతో గురక చేస్తూ ఉంటారు,కొంతమంది పగలు నిద్రపోతున్న సమయంలో కూడా గురక పెడుతూనే నిద్రపోతుంటారు. కొంతమంది రాత్రుల్లో శబ్దం చేస్తూ ఉంటారు, గురకపెట్టే వ్యక్తి శబ్దానికి పక్కన ఉన్న వ్యక్తులు కూడా ఆ శబ్దం భరించలేక పక్క రూములలో వెళ్లి పడుకుని సందర్భాలు కూడా చూస్తూ ఉంటాము
కొంతమందికి ఈ శబ్దం అనేది వారు గురక పెడుతున్నాము అన్న సంగతి వారికి కూడా తెలియకుండానే వారు పెడతా ఉంటారు, ఈ గురకతో పక్కన వారికి చాలా చిరాకు కలిగిస్తుంది,ఈ గురక అనేది పక్కవారికే ఇంత ఇబ్బందిని కలిగిస్తుంది అంటే మరి మీఆరోగ్యానికి కూడా ఎంత ఇబ్బందిని కలిగిస్తుంది అన్నది మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది ,గురక అనేది చిన్న చిన్న శబ్దాలతో చేస్తున్నప్పుడు అది మనకు సమస్యగా అనిపించకపోవచ్చు కానీ ఇదే గురక అనేది చాలా పెద్ద శబ్దంతో చేస్తున్నప్పుడు అది గురకగా మనం పరిగణించకూడదు దీనినే మనము స్లీప్ అప్నియా అంటాము .
గురక చాలా శబ్దంతో, ఎక్కువగా వస్తే చాలామంది “బాగా నిద్ర పట్టింది కాబట్టి ఇలా వస్తోంది” అని అనుకుంటారు. కానీ ఇది తప్పు. తీవ్రమైన గురక ఒక ఆరోగ్య సమస్యకు, ముఖ్యంగా స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం.

గురక & స్లీప్ అప్నియా మధ్య తేడా
గురక అనేది మీ నోటి లోపలి మృదువైన కండరములను దాటి శ్వాస తీసుకునప్పుడు కలిగే బొంగురు శబ్దం. మన భాషలో చెప్పాలంటే మనము నిద్రపోతున్నప్పుడు ఊపిరి తీసుకుంటే, గొంతు లేదా ముక్కులో గాలి సరిగ్గా వెళ్లకపోతే “ఘర్…ఘర్…” అని శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్నే గురక అంటారు.
కొన్ని సార్లు బాగా అలసిపోయినప్పుడు లేదా ముక్కు మూసుకుపోయినప్పుడు ఇలా జరుగుతుంది.
కానీ రోజూ బాగా శబ్దంగా గురక వస్తే పెద్దవాళ్లు డాక్టర్‌ని అడగాలి.గురక సాధారణ సమస్యలా కనిపించినా, అది స్లీప్ అప్నియా (అబెస్ట్రక్టీవ్ స్లీప్ అప్నియా (Obstructive Sleep Apnea)వంటి తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు.
స్లీప్ అప్నియా అనేది ఒక తీవ్రమైన నిద్ర సంబంధిత వ్యాధి. ఇందులో నిద్రలో ఉన్నప్పుడు శ్వాస నాళాలు తాత్కాలికంగా మూసుకుపోయి, కొన్ని సెకన్ల పాటు శ్వాస ఆగిపోతుంది. ఆ సమయంలో శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. మళ్లీ శ్వాస తీసుకునేందుకు వ్యక్తి తెలియకుండానే నిద్ర నుంచి మేలుకుంటాడు.
గురక & స్లీప్ అప్నియా మధ్య తేడా (టేబుల్)
| అంశం | గురక (Snoring) | స్లీప్ అప్నియా (Sleep Apnea) |
|---|---|---|
| సమస్య స్వభావం | శబ్దం మాత్రమే | శ్వాస ఆగిపోవడం |
| ఆక్సిజన్ సరఫరా | సాధారణంగా ఉంటుంది | తగ్గిపోతుంది |
| నిద్ర అంతరాయం | తక్కువ | ఎక్కువ |
| ఆరోగ్య ప్రమాదం | సాధారణంగా తక్కువ | ఎక్కువ, ప్రమాదకరం |
| చికిత్స అవసరం | ఎప్పుడూ అవసరం లేదు | తప్పనిసరి |

అబెస్ట్రక్టీవ్ స్లీప్ అప్నియా లక్షణాలు
శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు
మెదడు హెచ్చరికగా మిమ్మల్ని తాత్కాలికంగా నిద్ర నుంచి మేల్కొల్పుతుంది
ఈ ప్రక్రియ రాత్రంతా పదేపదే జరుగుతుంది
రాత్రి సమయంలో కనిపించే లక్షణాలు
-
- తీవ్రమైన గురక
-
- నిద్రలో శ్వాస ఆగిపోవడం
-
- అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేచిపోవడం
-
- నోరు ఎండిపోవడం
-
- నిద్రలో ఎక్కువ తిరగడం
పగటిపూట కనిపించే లక్షణాలు
-
- ఎక్కువ నిద్రమత్తు
-
- ఉదయం తలనొప్పి
-
- ఏకాగ్రత లోపించడం
-
- అలసట, చిరాకు
-
- జ్ఞాపకశక్తి తగ్గడం
అధికంగా గురక పెట్టే వాళ్ళు దీనిని చిన్న సమస్యగా పరిగణించకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది, గురక అధికంగా ఉన్నప్పుడు మనకు వచ్చే సమస్యలు అధిక రక్తపోటు , హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది బ్రెయిన్ స్ట్రోక్ కొట్టే అవకాశం ఉంది షుగర్ నియంత్రణ లోపిస్తుంది .గురకను ఎలా తగ్గించుకోవాలి
గురకను ఎలా తగ్గించుకోవాలి
మీ వైపు పడుకోండి: నాలుక వెనక్కి పడిపోకుండా నిరోధిస్తుంది.
బరువు తగ్గండి: గొంతు కణజాలాన్ని తగ్గిస్తుంది.
తల పైకెత్తండి: మంచం తలను కొన్ని అంగుళాలు పైకి లేపండి.
ఆల్కహాల్/మత్తుమందులను నివారించండి: ముఖ్యంగా పడుకునే ముందు.
ధూమపానం మానేయండి: వాపును తగ్గిస్తుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ సాధారణ అవగాహన, విజ్ఞానం కోసం మాత్రమే. దీనిని వ్యక్తిగత నిర్ణయాలు లేదా వృత్తిపరమైన సలహాగా పరిగణించవద్దు