
చక్కెర తినడం నోటికి తృప్తిగానే ఉండొచ్చు. కానీ, దీని వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బరువు పెరగడం దగ్గర్నుంచీ చర్మ సమస్యలు, జుట్టు సమస్యల వరకూ ఎన్నో ప్రాబ్లమ్స్ పంచదారతోనే వస్తాయి. కేవలం పంచదార మాత్రమే కాదు, దాంతో తయారైన స్వీట్స్, కుకీస్, పేస్ట్రీస్ ఇలా ఏ రూపంలో తీసుకున్నా వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉంటాయి. అందుకే, పంచదార అస్సలు మంచిది కాదని చాలా మంది చెబుతుంటారు. ఇదే విషయం గురించి డాక్టర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేశారు. పంచదారతో వచ్చే సమస్యల గురించి మాట్లాడుతూ దీనిని అవాయిడ్ చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా, ఎన్ని రోజులు అవాయిడ్ చేస్తే రిజల్ట్ ఉంటుందో కూడా చెబుతున్నారు. ఆమె ప్రకారం షుగర్‌ని అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే
పంచదారని అవాయిడ్ చేయడం వల్ల బాడీలో డీటాక్సీఫికేషన్ అవుతుంది. బాడీలో పేరుకుపోయిన ట్యాక్సిన్స్ అన్నీ కూడా చాలా వరకూ డీటాక్స్ అవుతాయి. దీంతో హెల్త్‌కి చాలా మంచిది. పంచదార మనం రెగ్యులర్‌గా తీసుకున్నప్పుడే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. దీంతో క్రేవింగ్స్ పెరిగి ఎక్కువగా తీసుకుంటాం. దీంతో కేలరీలు కూడా పెరుగుతాయి. ఎప్పుడైతే మనం షుగర్‌ని అవాయిడ్ చేస్తామో ఆటోమేటిగ్గా క్రేవింగ్స్ తగ్గుతాయి. కేలరీలు కూడా తగ్గుతాయి.
పంచదారని అవాయిడ్ చేస్తే బాడీలో పేరుకుపోయిన ఎక్స్‌ట్రా ఫ్యాట్ తగ్గుతుంది. అంటే చాలా వరకూ బరువు కూడా తగ్గుతారు. ఫ్యాట్ కారణంగా వచ్చే ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి. సన్నగా కావాల్సిన వారు, ఉన్న బరువుని తగ్గించుకోవాలనుకునేవారు షుగర్‌ని అవాయిడ్ చేసి చూడండి. దీంతో చాలా వరకూ రిజల్ట్ ఉంటుంది.
