మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి
ఈ రోజుల్లో మలబద్ధకం అనేది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యగా మారిపోయింది. జీవనశైలిలో వచ్చిన మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిర్లక్ష్యం కలిసి మలబద్ధకాన్ని మరింత పెంచుతున్నాయి. మలబద్ధకం ఉన్న చాలామంది వెంటనే మందుల వైపు మొగ్గుచూపుతూ “ఆలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం” అంటూ ఎలాంటి ఔషధాలైనా తరచుగా వాడుతూ ఉంటారు.
కానీ ఒకసారి ఆలోచించాలి…ఎంతకాలం మనం మందులపై ఆధారపడి జీవనం కొనసాగించగలం?మందులు తరచుగా వాడితే అవి అలవాటుగా మారి, మన శరీరం స్వయంగా పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.అందుకే, ముందుగా చేయవలసింది –మందులపై ఆధారపడకుండా, మన జీవనశైలి మరియు ఆహారపుఅలవాట్లనుమార్చుకోవడం.మలబద్ధకంపోవాలటే ఇంట్లోనే అందుబాటులో ఉన్న సహజ పద్ధతులను పాటిస్తే, మలబద్ధకం మళ్లీ రాకుండా పూర్తిగా నియంత్రించుకోవచ్చు. పుష్కలమైన నీరు త్రాగడం, ఫైబర్ ఉన్న ఆహారం తినడం, నియమిత వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి చిన్న మార్పులు కూడా పెద్ద ప్రయోజనం ఇస్తాయి.
సరైన ఆహారం + సరైన జీవనశైలి = మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం
మలబద్ధకానికి ప్రధాన కారణాలు
మలబద్ధకం రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ఈ రోజుల్లో ఎక్కువగా కనిపించే ప్రధాన కారణాలు ఇవే. మొదటగా, చాలామంది రోజు తప్పనిసరిగా తాగాల్సిన 2–3 లీటర్ల నీటినీ సరిపడా తాగరు. నీటి లోపం వల్ల మలము గట్టిగా మారి బయటకు రావడం కష్టమవుతుంది.
అలాగే, రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాలు వాకింగ్ లేదా శారీరక వ్యాయామం చేయకపోవడం కూడా ప్రధాన కారణం. ఒకే చోట చాలా సేపు కూర్చుని పనిచేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి మలబద్ధకం ఎక్కువగా వస్తుంది.
మనం తీసుకునే ఆహారం సరైన సమతుల్యంగా లేకపోయినా మలబద్ధకం వచ్చే అవకాశం ఎక్కువ. నేటి ఆహార అలవాట్లలో ముఖ్యంగా:
-
చికెన్, మటన్ వంటి నాన్‌వెజ్‌ను తరచుగా ఎక్కువగా తినడం
-
బేకరీ ఐటమ్స్, పఫ్‌లు, కేకులు
-
చపాతీలు, గోధుమ పిండి వంటలను అధికంగా తీసుకోవడం
-
పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్‌ఫుడ్
ఇలాంటి ఆహారాల్లో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల మలవిసర్జన సరిగా జరగదు.
అందుకే మలబద్ధకాన్ని నివారించాలంటే, ముందుగా నీరు సరిపడా తాగడం, నిత్య వ్యాయామం చేయడం, ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు చేర్చుకోవడం చాలా అవసరం.
మలబద్ధకాన్ని తగ్గించడానికి
మలబద్ధకాన్ని తగ్గించడానికి మనం రోజువారి అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది
రోజు నీళ్లు ఎక్కువగా తాగాలి రెండు నుంచి మూడు లీటర్లు రోజు మొత్తంలో తీసుకోవాలి
ఉదయం లేవగానే నడకను కనీసం 20 నుంచి 30 నిమిషాలైనా కాలినడకన నడుస్తూ ఉండాలి దీని వల్ల పేగుల కదలిక అనేది సవ్యంగా జరిగి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది
మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే మనం తిన్న చోటనే ఉండిపోకుండా తిన్న తర్వాత నడక ఒక 10 నిమిషాలు చేసిన, ఒకే చోట పని చేస్తూ అలాగే కూర్చొని ఉండకుండా కాస్త అటు ఇటు నడిచే మల్లి కాసేపు అయ్యాక ఇలా చేస్తూ ఉండాలి ఒకే చోటు కూర్చోవడం వల్ల మన పేగుల్లో కదలిక లేనందుకు మనం తిన్న జీర్ణం కాకుండా మలబద్ధకానికి కారణం అవుతుంది
మలబద్ధకం నివారణకు ఇంటి చిట్కాలు
1. ఉదయం గోరు వెచ్చని నీటితో నిమ్మరసం
మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో అరకాయ నిమ్మరసం కలిపి తాగడం పేగులను చురుకుగా పనిచేయేటట్లుగా చేస్తుంది. నిమ్మలో ఉన్న సిట్రిక్ యాసిడ్ టాక్సిన్స్‌ను బయటకు పంపి మలబద్ధకాన్ని సహజంగా తగ్గిస్తుంది.
2. రోజూ తగినంత నీరు తాగండి
ఒక్క రోజు కనీసం 2.5–3 లీటర్లు నీరు తాగడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నీరసం తగ్గి మల సాఫ్ట్‌గా మారి సులభంగా బయటకు వస్తుంది. అలవాటు లేని వారికి అలారమ్ పెట్టుకొని నీరు తాగే పద్ధతి ఉపయోగపడుతుంది.
3. ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోండి
ఫైబర్ అనేది పేగులను శుభ్రం చేసి మలబద్ధకం రాకుండా కాపాడే ముఖ్యమైన మూలకం.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు:
ఆపిల్, బొప్పాయి, అరటి
బ్రౌన్ రైస్
ఓట్స్, రాగి, జొన్న, సజ్జ
పచ్చికూరలు
కీరదోస, క్యారెట్, బీట్‌రూట్
రోజుకి కనీసం 25–30 గ్రాముల ఫైబర్ తీసుకుంటే మలబద్ధకం చాలా వరకు తగ్గుతుంది.
4. నిద్రకి ముందు నేయి + గోరు వెచ్చని నీరు
ఒక స్పూన్ నేయిని గోరు వెచ్చని నీటిలో కలిపి నిద్రకు ముందు తాగితే పేగులు సాఫ్ట్‌గా మారి ఉదయాన్నే సులభంగా మల విసర్జన జరుగుతుంది. ఆయుర్వేదంలో ఇది మంచి natural lubricantగా పరిగణించబడుతుంది.
5. పండ్ల రసాలు – సహజ laxatives
అప్పుడప్పుడు తాగే పండ్ల రసాలు కూడా జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా:
బొప్పాయ రసం
ద్రాక్ష రసం
ఆపిల్ జ్యూస్
ఇవి పేగుల కదలికను పెంచి మలబద్దకాన్ని తగ్గిస్తాయి.
6. రోజువారీ నడక తప్పనిసరి
రోజుకు కనీసం 30–40 నిమిషాలు వాకింగ్ చేయడం పేగుల కదలికను పెంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం మలబద్దకాన్ని మరింత పెంచుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.