ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

వన్ ఇండియా, వన్ ట్యాక్స్, వన్ ఎలక్షన్స్ అనే మాటలు మనం తరచూ వింటుంటాం. కానీ వాటికన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన మాట వన్ ఇన్సూరెన్స్. Health Insurance & Life Insurance అవగాహన అనేది కేవలం ఒక పాలసీ కాదు, అది మన జీవితాన్ని మార్చే శక్తి. ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉండటం వల్ల అతడికే కాదు, అతని కుటుంబానికి కూడా భరోసా కలుగుతుంది. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు, కానీ అలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో కుటుంబాన్ని కాపాడే సంజీవని లాంటిదే ఇన్సూరెన్స్. ఆర్థిక భద్రతను అందిస్తూ, భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచే ఉత్తమమైన రక్షణగా ఇన్సూరెన్స్ నిలుస్తుంది.జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు…
కానీ ఆ మార్పును ఎదుర్కొనే శక్తి
ఒకే ఒక నిర్ణయంతో వస్తుంది —
అదే ఇన్సూరెన్స్ తీసుకోవడం.

ఇన్సూరెన్స్ పట్ల నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది?

చాలా మంది ఇన్సూరెన్స్( బీమా) పట్ల అవగాహన లేకపోవడం ఒకవేళ అవగాహన ఉన్న
దాన్ని పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం చేయడం, చాలామంది పిల్లల చదువుల కోసంఅప్పులు
చేసి మరీ చదివిస్తూ ఉంటారు,మరి కొంతమంది అప్పులు చేసే పిల్లలపెళ్లిలు చేస్తూ ఉంటారు,
అప్పు చేసి మరీ ఇల్లు కట్టుకుంటారు,ఇంకొందరు వారి యొక్క వేసనాల కోసం డబ్బులు వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారు, ప్రతి ఒక పనికి అవసరానికో లేకపోతే వృధా ఖర్చు చేయడానికి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము.
కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు ఆరోగ్యం(health) బాగా లేనప్పుడు మనకు జబ్బు చేసినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎవరి దగ్గర అప్పు చేయవలసిన అవసరం లేదు ఎవరిని చేయి చాపాల్సిన అవసరం లేదు ఇలా ఇన్సూరెన్స్ తీసుకోవడం , జబ్బు వచ్చినప్పుడు డబ్బు కోసం టెన్షన్ పడకుండా ఉండేందుకు తీసుకునే భద్రతే Health Insurance.

Health Insurance (హెల్త్ ఇన్సూరెన్స్) vs Life Insurance (లైఫ్ ఇన్సూరెన్స్)– తేడా

Health Insurance = జబ్బు వచ్చినప్పుడు ఖర్చుల నుంచి రక్షణ

Life Insurance = మనం లేనప్పుడు కుటుంబానికి రక్షణ(వ్యక్తి మరణించిన తర్వాత కుటుంబానికి ఆర్థిక భద్రత)

Health Insurance అంటే ఏమిటి?

మనకు జబ్బు వచ్చినప్పుడు లేదా ప్రమాదం జరిగితే:

    • ఆసుపత్రి బిల్లులు

    • ఆపరేషన్ ఖర్చులు

    • మందుల ఖర్చులు

    • ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి.

    • హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే, ఈ ఖర్చుల్లో చాలా భాగం లేదా మొత్తం బీమా కంపెనీ చెల్లిస్తుంది.


ఆరోగ్య భద్రతకి → Health Insurance తప్పనిసరి

కుటుంబ భవిష్యత్తుకు → Life Insurance అవసరం

Life Insurance (లైఫ్ ఇన్సూరెన్స్) ప్రాధాన్యత

లైఫ్ ఇన్సూరెన్స్ మనం ఉన్నప్పుడు కాదు, మనము లేకపోయినప్పుడు కుటుంబానికి అండగా నిలుస్తుంది. కుటుంబానికి ఆర్థిక భద్రత, పిల్లల చదువు, ఇంటి ఖర్చులు – ఇవన్నీ కొనసాగాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ చాలా అవసరం.

ఇన్సూరెన్స్ అనేది విలాసం కాదు – అది అవసరం. ఈరోజు తీసుకున్న ఒక సరైన నిర్ణయం రేపు మీ కుటుంబ జీవితాన్ని మార్చగలదు. కాబట్టి ఆలస్యం చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొని మీ కుటుంబానికి నిజమైన సంజీవని అందించండి.

మార్కెట్లో అనేక హెల్త్ ఇన్యూరెన్స్ కంపెనీలు ఉన్నాయి

2 thoughts on “ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?”

Leave a Comment