హై బీపీ పెరగడానికి కారణాలు

 హై బీపీ(High BP) పెరగడానికి కారణాలను డాక్టర్ సుధీర్ కుమార్ అపోలో హాస్పిటల్ హైదరాబాద్ ,తన పోస్టులో ఈ విధంగా తెలియజేశారు ,హై బీపీ పెరగటం అనేది ఒక్కరోజు అలవాటు వల్ల కాదు, రోజు మనం చేసే చిన్న చిన్న అలవాట్లు కలిసే కాలక్రమంలో బీపీని పెంచుతాయి అని పోస్టులో చెప్పారు(డా. సుధీర్ కుమార్ (సీనియర్ న్యూరాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ – హైదరాబాద్)

హై బీపీ పెరగడానికి కారణాలు

డాక్టర్ సుధీర్ కుమార్ గారు చెప్పిన ముఖ్యమైన అంశాలు(హై బీపీ పెరగడానికి కారణాలు)

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన లేకపోతే మన కుటుంబ చరిత్ర మాత్రమే కాదు … మన రోజువారి అలవాట్లే బీపీని క్రమంగా పెంచుతాయి

1. అధిక స్ట్రెస్ మరియు ట్రాఫిక్ టెన్షన్ తీసుకోవడం

2.ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం

3. అధిక పని ఒత్తిడి (Work pressure)

4.సరైన నిద్ర లేకపోవడం, అతిగా నిద్రపోవడం

5. ఒంటరితనం

6.సామాజిక మద్దతు లేకపోవడం

ఉప్పు కాకుండా ఇంకా హైబీపీని (Hypertension) పెంచే కారణాలు ఏముంటాయి అంటే ఎక్కువగా చక్కర పదార్థాలను తీసుకోవడం, అధికంగా కాఫీలు, ఎనర్జీ డ్రింకులు ,మద్యం ఎక్కువగా సేవించడం వలన, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, పొగ తాగడం వల్ల మరియు వ్యాయామం సరిగా లేకపోవడం వల్ల,ఇవన్నీ కూడా అధిక బీపీని పెంచుతాయని డాక్టర్ సుధీర్ కుమార్ గారు పోస్టులో పేర్కొన్నారు

హై బీపీ పెరగడానికి కారణాలు

1. అధిక స్ట్రెస్(Stress)

అధిక స్ట్రెస్  వల్ల మనకు బీపీ పెరగటం మాత్రమే కాదు ,గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంది, రోజు ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేయడం, అనవసరంగా కోపం తెచ్చుకోవడం ,కోపం ఎక్కువ అయినప్పుడు కూడా BP రావటానికి అవకాశం ఉంది .

ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం వలన , మన శరీరానికి ఎలాంటి బ్లడ్ సర్కులేషన్ అనేది జరగకుండా ఉంటుంది ,మనకు ఎలాంటి వ్యాయామం లేకపోవడం.

ఎక్కువ పని గంటలు, నిరంతర టెన్షన్, ఆందోళన — ఇవి హృదయంపై ఒత్తిడి పెంచి హై బీపీకి దారి తీస్తాయి.

సరైన నిద్ర లేకపోవడం వలన మరియు నిద్ర ఎక్కువైనా కూడా హైబీపీ పెరిగే అవకాశం ఉంటుంది .

మద్యం సేవించడం మరియు స్మోకింగ్ కూడా బీపీని పెంచే కారణాలే.

హై బీపీ డైట్ TABLE

 

  • సమయం
తినాల్సిన ఆహారంసూచనలు
🌅 ఉదయం లేవగానేగోరువెచ్చని నీరు 1 గ్లాస్ / నిమ్మరసం + తేనెఉప్పు వేయకూడదు
☀️ అల్పాహారంఓట్స్ ఉప్మా / 2 ఇడ్లీ + సాంబార్ / వెజిటబుల్ ఉప్మానూనె, ఉప్పు తక్కువగా
🍎 మధ్యాహ్నం ముందుఆపిల్ / బొప్పాయి / నారింజ (1 పండు)తాజా పండ్లు మాత్రమే
🍛 మధ్యాహ్న భోజనంబ్రౌన్ రైస్ (1 కప్పు), పప్పు, ఆకుకూరలు, కూరగాయ కూర, పెరుగుపచ్చళ్ళు తగ్గించాలి
☕ సాయంత్రంగ్రీన్ టీ / మొలకెత్తిన శనగలు / మురమురాలు (ఉప్పు లేకుండా)బిస్కెట్లు వద్దు
🌙 రాత్రి భోజనం2 చపాతీలు, కూరగాయ కూర, పప్పు లేదా సూప్నిద్రకు 2 గంటల ముందు
🥛 నిద్రకు ముందుగోరువెచ్చని పాలు / 5–6 బాదం

ఉప్పు లేని డ్రైఫ్రూట్స్

NOTE: పైన పేర్కొన్నTABLE అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం ధృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.

Leave a Comment