రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా?

రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా

రాత్రి పడుకునే ముందు చాలామందికి కనీసం అరగంటైనా మొబైల్ చూడకుండా నిద్రపోవడం కష్టంగా మారిపోయింది,ఏమైనా వాట్సాప్ మెసేజ్ వచ్చిందా అని చూసి, ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడం, ఫేస్‌బుక్ అప్డేట్స్ చూడడం ఇలా మొదలయ్యే ఈ అలవాటు తెలియకుండానే అరగంటను గంటలుగా మార్చేస్తుంది.

పడుకునే ముందు ఇవి చూసినప్పుడు మనసుకు కాస్త మానసిక ఆనందం, రిలీఫ్ వచ్చినట్టు అనిపించినా, ఆ సమయంలో మన మైండ్ పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండా యాక్టివ్ మోడ్‌లోనే ఉంటుంది, దాంతో నిద్రపోయే సమయంలో మైండ్ పని చేయకుండా ఇంకా ఆలోచనలు చేస్తూ ఉంటుంది, ఫలితంగా నిద్ర లోతుగా పడదు, శరీరం పడుకున్నా మనసు మాత్రం మేల్కొని ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇదే కారణంగా చాలామందికి ఈ అలవాటు రోజూ కొనసాగుతూ నిద్ర నాణ్యతను మెల్లగా తగ్గిస్తోంది.

రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా
రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా

రాత్రివేళ సెల్‌ఫోన్ ఎక్కువగా వాడటం మన మెదడుపై నేరుగా ప్రభావం చూపుతుంది, ఎందుకంటే మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది (దీనిని నిద్ర హార్మోన్ అని అంటారు).

ఈ హార్మోన్ వలన నిద్ర పట్టడం ఆలస్యం కావడం, మధ్యమధ్యలో మెలుకువ రావడం, నిద్ర సరిగా లేకపోవడం జరుగుతుంది,దీని వల్ల తలనొప్పి, కళ్ల నొప్పి, వంటి సమస్యలు వస్తాయి, రోజూ ఇదే అలవాటు కొనసాగితే సరైన నిద్ర లేకపోవడం , మరుసటి రోజు దీని ప్రభావం వలన, చిరాకు పెరగడం, పనుల్లో ఏకాగ్రత లేకపోవడం జరుగుతుంది, ఫలితంగా చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, మన పనులు సరిగా చేయలేకపోవడం, తెలియకుండానే ఇతరులపై కోపం చూపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

అందుకే రాత్రివేళ మొబైల్ వినియోగాన్ని తగ్గించడం మన మానసిక ప్రశాంతతకూ, రోజువారీ జీవితానికీ చాలా అవసరం.

రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా
రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా

Leave a Comment