రాత్రి నిద్రకు ముందు మొబైల్ ఫోన్ చూస్తున్నారా?

పడుకునే ముందు ఇవి చూసినప్పుడు మనసుకు కాస్త మానసిక ఆనందం, రిలీఫ్ వచ్చినట్టు అనిపించినా, ఆ సమయంలో మన మైండ్ పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండా యాక్టివ్ మోడ్‌లోనే ఉంటుంది, దాంతో నిద్రపోయే సమయంలో మైండ్ పని చేయకుండా ఇంకా ఆలోచనలు చేస్తూ ఉంటుంది, ఫలితంగా నిద్ర లోతుగా పడదు, శరీరం పడుకున్నా మనసు మాత్రం మేల్కొని ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇదే కారణంగా చాలామందికి ఈ అలవాటు రోజూ కొనసాగుతూ నిద్ర నాణ్యతను మెల్లగా తగ్గిస్తోంది.
రాత్రివేళ సెల్‌ఫోన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మన మెదడు మీద

రాత్రివేళ సెల్‌ఫోన్ ఎక్కువగా వాడటం మన మెదడుపై నేరుగా ప్రభావం చూపుతుంది, ఎందుకంటే మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది (దీనిని నిద్ర హార్మోన్ అని అంటారు).
ఈ హార్మోన్ వలన నిద్ర పట్టడం ఆలస్యం కావడం, మధ్యమధ్యలో మెలుకువ రావడం, నిద్ర సరిగా లేకపోవడం జరుగుతుంది,దీని వల్ల తలనొప్పి, కళ్ల నొప్పి, వంటి సమస్యలు వస్తాయి, రోజూ ఇదే అలవాటు కొనసాగితే సరైన నిద్ర లేకపోవడం , మరుసటి రోజు దీని ప్రభావం వలన, చిరాకు పెరగడం, పనుల్లో ఏకాగ్రత లేకపోవడం జరుగుతుంది, ఫలితంగా చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, మన పనులు సరిగా చేయలేకపోవడం, తెలియకుండానే ఇతరులపై కోపం చూపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
అందుకే రాత్రివేళ మొబైల్ వినియోగాన్ని తగ్గించడం మన మానసిక ప్రశాంతతకూ, రోజువారీ జీవితానికీ చాలా అవసరం.
ఈ అలవాటును ఎలా తగ్గించుకోవాలి ?

పడుకోవడానికి ముందు అత్యవసరం అయితే తప్ప సెల్‌ఫోన్ ఉపయోగించకపోవడం చాలా మంచిది.
కనీసం పడుకునే రెండు గంటల ముందైనా మొబైల్‌ను మనకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి.
ఫోన్లో తప్పనిసరిగా నైట్ మోడ్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్ ఆన్ చేయాలి, అలాగే స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించుకోవాలి.
ఎందుకంటే పడుకునే దగ్గరే సెల్ ఉంచుకుంటే మళ్లీ మళ్లీ చూసే అలవాటు, ఆసక్తి పెరుగుతుంది, దాంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది, కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టి ప్రశాంతంగా పడుకోవడంమన నిద్ర నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా మనసుకూ శరీరానికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది.
బి హెల్త్ తెలుగు సందేశం
ఒకప్పుడు సెల్ఫోన్లు లేని రోజుల్లో రాత్రి పడుకునే ముందు పిల్లలు అమ్మమ్మలు, తాతయ్యలు, అమ్మ చెప్పే కథలు వింటూ హాయిగా నిద్రపోయేవారు, చందమామను చూస్తూ, కథల్లోని పాత్రలను ఊహించుకుంటూ నిద్రలోకి వెళ్లేవారు, కానీ ఈరోజు జనరేషన్లో రాత్రి పడుకునే ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకుని ఎవరి ప్రపంచంలో వాళ్లు మునిగిపోవడం అలవాటుగా మారిపోయింది, దీని వల్ల కుటుంబంతో మాట్లాడే సమయం తగ్గిపోయి మనుషుల మధ్య దూరం పెరుగుతోంది.
అందుకే తల్లిదండ్రులు, పెద్దలు రాత్రి వేళ మొబైల్ వాడకాన్ని తగ్గించి, పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించి, వారికి తెలియని విషయాలు చెప్పుతూ, మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ, చిన్న చిన్న కథలు చెప్పడం అలవాటు చేస్తే, పిల్లలు సహజంగానే ఈ అలవాటు నుంచి దూరమవుతారు, వారి మెదడు చురుకుగా పనిచేస్తుంది, ఆలోచనా శక్తి పెరుగుతుంది, భవిష్యత్తు కూడా బలంగా తయారవుతుంది—ఇదే మా B హెల్త్ తెలుగు వెబ్సైట్ హృదయపూర్వక సందేశం.