కుక్క కరిచిన వెంటనే ఈ తప్పు అసలు చేయకండి!

కుక్క కరిచిన వెంటనే చాలామంది  ఇది చిన్న గాయం మాత్రమే, తగ్గిపోతుంది అని నిర్లక్ష్యం చేస్తారు, ఇంట్లో పెంచుకునే కుక్కలు కావడంతో మరింత నిర్లక్ష్యం చేస్తూ, అవి మన చేతులు లేదా చర్మాన్ని నాకినా పెద్దగా పట్టించుకోరు, ప్రేమతో వాటిని దగ్గరగా ఉంచుతారు కానీ ఈ అలవాటు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంది.

కుక్క కరిచిన వెంటనే ఈ తప్పు అసలు చేయకండి!
కుక్క కరిచిన వెంటనే ఈ తప్పు అసలు చేయకండి!

ఇటీవల జరిగిన ఒక యథార్థ సంఘటనలో, ఒక మహిళ తన ఇంట్లో పెంచుకునే కుక్క, మహిళ  చేతికి చిన్నగా గాటు వేసింది, ఆ గాయాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాకుండా, ఆ కుక్క తరచూ ఆ గాయాన్ని నాకుతూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న గాయం ఇన్ఫెక్షన్‌గా మారింది, పరిస్థితి విషమించడంతో ఆమె డాక్టర్లను సంప్రదించగా, కుక్క నాకిన కారణంగా బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌గా మారిందని చెప్పారు.

డాక్టర్లు ఆమెకు బ్రతకాలంటే ఆ ఇన్ఫెక్షన్ ఉన్న భాగాన్ని తొలగించాల్సిందే అని సూచించారు, లేదంటే ఆ ఇన్ఫెక్షన్ శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు, వెంటనే ఆ భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ సంఘటన మనకు ఒక పెద్ద హెచ్చరిక. ఇంట్లో పెంచుకునే కుక్క అయినా సరే, గాయాలను నిర్లక్ష్యం చేయకూడదు. 

కుక్క కరిచిన వెంటనే గాయాన్ని నిర్లక్ష్యం చేయకుండా, సబ్బుతో బాగా కడగడం తప్పనిసరి.

ఇది చిన్న చర్య అయినా, ప్రాణాలను కాపాడగలిగే ముఖ్యమైన అలవాటు.

కుక్క కరిచిన వెంటనే చాలా మంది కేవలం నీటితో గాయాన్ని కడగడం సరిపోతుందని అనుకుంటారు, కానీ ఇది సరిపోదు, గాయాన్ని వెంటనే సబ్బుతో 10 నుండి 15 నిమిషాల పాటు బాగా కడగడం చాలా అవసరం.

సబ్బుతో గాయాన్ని కడగడం వల్ల కుక్క నోటి ద్వారా వచ్చే ప్రమాదకరమైన బ్యాక్టీరియా మరియు రేబిస్ వైరస్ గాయంలో నుంచే తొలగించబడతాయి. కేవలం నీటితో కడిగితే అన్ని జర్మ్స్ పూర్తిగా తొలగవు.

కుక్క కరిచినప్పుడు రేబిస్ అనే ప్రమాదకరమైన వైరస్ శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది, సబ్బుతో బాగా కడగడం వల్ల ఈ వైరస్ శరీరంలోకి వెళ్లకుండా కొంతవరకు అడ్డుకోవచ్చు.

సబ్బుతో 10–15 నిమిషాలు గాయాన్ని శుభ్రం చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఇది ప్రమాదాన్ని సగం వరకు తగ్గించే ముఖ్యమైన ఫస్ట్ ఎయిడ్ చర్యగా పరిగణించబడుతుంది.

రేబిస్ అనే వైరస్ కుక్క యొక్క లాలాజలం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది నేరుగా రక్తంలో కలవదు. బదులుగా, నరాల ద్వారా ప్రయాణిస్తూ మెదడుకు చేరుకుంటుంది.

మెదడుకు చేరిన తర్వాత, ఈ వైరస్ మన నర్వస్ సిస్టమ్‌ను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మనిషి ప్రవర్తనలో మార్పులు వస్తాయి.

రేబిస్ యొక్క లక్షణాలు వెంటనే కనిపించవు. కొన్ని రోజులు, వారం లేదా పది రోజుల తర్వాత కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు. మొదటగా స్వల్ప జ్వరం, అలసట, కొద్దిగా తలనొప్పి వంటి లక్షణాలు ప్రారంభమవుతాయి.

తర్వాత వైరస్ తీవ్రంగా ఉంటే, ఇన్ఫెక్షన్ శరీరంలో ఎక్కువగా వ్యాపిస్తుంది.

  • నీళ్లు చూసినా భయం (Hydrophobia)
  • గాలి శబ్దం లేదా కాంతి కూడా తట్టుకోలేకపోవడం
  • ఆందోళన, భయం పెరగడం
  • అసహజ ప్రవర్తన

టీకా తీసుకోవడం ద్వారా కుక్క ద్వారా ప్రవేశించిన రేబిస్ వైరస్‌ను ఎదుర్కొనే శక్తి మన శరీరానికి లభిస్తుంది, కుక్క కరిచిన వెంటనే టీకా తీసుకుంటే ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండదు.

ఈ టీకా మన ఇమ్యూన్ సిస్టమ్‌ను బలపరచి వైరస్‌ను అడ్డుకుంటుంది, ఫలితంగా రేబిస్ వైరస్ శరీరంలో ఎక్కువగా వ్యాపించకుండా నియంత్రణలో ఉంటుంది. ఇది భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను తగ్గించి మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

కుక్క కరిచిన వెంటనే నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం, రేపు వెళ్దాం అని ఆలస్యం చేయకుండా, వెంటనే కొన్ని గంటల్లోనే డాక్టర్‌ను సంప్రదించడం అత్యంత ముఖ్యం.

కాటు చిన్నదైనా పెద్దదైనా ప్రమాదం ఉంటుంది. చాలా సార్లు చిన్న గాటు కూడా సీరియస్ అవుతుంది, ముఖ్యంగా కుక్క గాయాన్ని నాకినట్లయితే లేదా గోర్లతో గుచ్చినట్లయితే కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.

అందుకే ఏ చిన్న గాయం అయినా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే గాయాన్ని సబ్బు మరియు నీటితో బాగా కడిగి, దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలి. డాక్టర్ సూచించినట్లుగా రేబిస్ టీకా తీసుకోవడం తప్పనిసరి.

ఆలస్యంగా వెళ్లితే వైరస్ శరీరంలో వ్యాపించి ప్రమాదం పెరుగుతుంది. కానీ సమయానికి చికిత్స తీసుకుంటే ప్రాణాన్ని సులభంగా కాపాడుకోవచ్చు.

ఎలాంటి ఇంటి చిట్కాలు ఈ సమస్యకు సరిపోవు. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని నీరు మరియు సబ్బుతో బాగా కడగాలి. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మాత్రమే సరైన చికిత్స. ఇలా చేయడం ద్వారా మీరు మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు.

లేకపోతే, రేబిస్ వంటి వ్యాధి తీవ్రంగా పెరిగితే ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. మన చుట్టూ కూడా కుక్క కాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి కేసులు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి.

ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. కుక్క గాయం నాకినా లేదా గోర్లతో గుచ్చినా పిల్లలు చాలాసార్లు తల్లిదండ్రులకు చెప్పరు. ఆటల్లో మునిగిపోయి మర్చిపోతారు. అందుకే పిల్లలను బయటకు పంపే ముందు కుక్కల గురించి జాగ్రత్తలు చెప్పాలి.

అన్ని కుక్కలు ఒకలా ఉండవు. ఏ సమయంలో ఏ కుక్క ఎలా ప్రవర్తిస్తుందో చెప్పలేం. అందుకే పిల్లలను కుక్కల నుండి దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. పిల్లల భద్రత తల్లిదండ్రుల బాధ్యత, కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి

ముగింపు (Conclusion)

పెంపుడు కుక్కల విషయంలో కూడా జాగ్రత్త చాలా ముఖ్యం,టీకాలు వేయించినప్పటికీ, మీ పిల్లలు కుక్కల దగ్గరికి చాలా దగ్గరగా వెళ్లకుండా చూసుకోవాలి, ప్రేమను చూపించడం తప్పు కాదు, కానీ కుక్క నోటి దగ్గర ముద్దులు పెట్టడం, వాటితో ఎక్కువగా దగ్గరగా ఆడుకోవడం, తర్వాత చేతులు కడగకుండా తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఇంట్లో పెంచుకునే కుక్క అయినా, అది కుక్క స్వభావమే కలిగి ఉంటుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో పూర్తిగా చెప్పలేం. అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

పిల్లలు పెద్దలను చూసి నేర్చుకుంటారు. మీరు కుక్కలతో ఎలా ప్రవర్తిస్తారో వారు కూడా అలాగే చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉంటేనే పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంటారు.

కాబట్టి ముందుగా మీరు నియమాలు పాటించాలి. అప్పుడు మాత్రమే మీ పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉంటారు మరియు కుక్కల నుండి సురక్షితంగా దూరంగా ఉండగలుగుతారు..


Leave a Comment