ఇప్పటి అమ్మాయిలు ఎందుకు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు?

ఒకప్పుడు అమ్మాయిలు 13, 14, 15 సంవత్సరాలకు మెచ్యూర్ అయ్యేవారు, అది అప్పటి జీవనశైలి.
ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు 9, 10, 11 సంవత్సరాలకే త్వరగా మెచ్యూర్ అవుతున్నారు,ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉండే అమ్మాయిలు.

మన శరీరంలో హార్మోన్లు అనే రసాయనాలు ఉంటాయి. ఇవే పెరుగుదల, మెన్సెస్, శారీరక మార్పులను కంట్రోల్ చేస్తాయి.కొన్ని కారణాల వల్ల ఈ హార్మోన్లు ముందే యాక్టివ్ అవుతాయి. హార్మోన్లు ఇన్‌బ్యాలెన్స్ కారణంగా అమ్మాయిలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు.

అంటే సాధారణంగా రావాల్సిన వయస్సుకి ముందే మెన్సెస్ త్వరగా రావడం. దీనినే వైద్య భాషలో Early Maturity లేదా Early Puberty అని అంటారు. ఇది చూసి చాలా మంది తల్లులు భయపడుతున్నారు, కానీ నిజంగా చెప్పాలంటే భయపడాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే అప్పటి లైఫ్ స్టైల్ వేరు – ఇప్పటి లైఫ్ స్టైల్ వేరు.

ఒకప్పుడు ఆహారపు జీవనశైలి(లైఫ్ స్టైల్)
ఒకప్పుడు మన అమ్మలు, అమ్మమ్మలు తయారు చేసే సహజమైన ఇంటి ఆహారమే మన ప్రధాన జీవనశైలి. అప్పట్లో బయట తినే అలవాటు చాలా తక్కువగా ఉండేది. ఇంట్లో వండిన ఆహారాన్ని సమయానికి తినడం, బయట ఎక్కువగా ఆడుకోవడం వల్ల శరీరం సహజంగా బలంగా ఎదిగేది.

ఇప్పటి పిల్లల జీవనశైలి
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది,పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు, మాగీ, నూడుల్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్‌కు పిల్లలు అలవాటు పడిపోయారు. పైగా స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ద్వారా ఇంటికే ఆహారం తెప్పించుకునే అలవాటు పెరిగింది. ఆ ఫుడ్ ఎలా తయారవుతుంది, అందులో ఏమేమి ఉంటాయి అనే విషయాలు చాలామందికి తెలియకుండానే తినడం జరుగుతోంది. బయట ఆటలు తగ్గి, కూర్చునే జీవితం పెరిగింది.

ముఖ్యంగా పిల్లల లంచ్ బాక్స్‌లలో, వేడి వేడి అన్నం లేదా కూరలను ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టినప్పుడు, అందులో ఉన్న హానికరమైన రసాయనాలు ఆహారంలో కలిసే అవకాశం ఉంటుంది.

అవి శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపి జీవనశైలిని నెమ్మదిగా మార్చేస్తాయి. అందుకే పిల్లలకు ఉదయం భోజనం లేదా లంచ్ ఇవ్వేటప్పుడు ప్లాస్టిక్ పాత్రలను తప్పించి, స్టీల్ లేదా గ్లాస్ డబ్బాలను అలవాటు చేయడం చాలా మంచిది.

సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం
ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎక్కువ సమయం సెల్ ఫోన్‌లోనే గడుపుతున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో వీడియోలు, పోస్టులు చూస్తూ గంటల తరబడి ఒకే చోట కూర్చుంటున్నారు. అప్పట్లో మనకు టీవీ చూడటానికి కూడా ఎక్కువ టైమ్ ఉండేది కాదు. ఎక్కువగా బయట ఆటలు, నడక, పరుగులు ఉండేవి. ఆ శారీరక చురుకుదనం వల్ల శరీరంలో హార్మోన్లు సహజంగా బ్యాలెన్స్‌లో ఉండేవి.

నిద్ర లోపం
ఇప్పటి రోజుల్లో చాలామంది పిల్లలకు సరైన నిద్ర ఉండటం లేదు. రాత్రి ఆలస్యంగా మొబైల్ చూడటం, టీవీ చూడటం, హోంవర్క్ ఒత్తిడి వల్ల నిద్ర సమయం తగ్గిపోతోంది. నిద్ర సరిగా లేకపోతే మన శరీరంలో ఉండే హార్మోన్లు సరిగ్గా పనిచేయవు, వాటి మధ్య బ్యాలెన్స్ తగ్గిపోతుంది.

దీని వల్ల శరీరంలో మార్పులు త్వరగా రావడం, మెచ్యూర్ అవ్వడం కూడా ముందుగానే జరిగే అవకాశం ఉంటుంది. అందుకే తల్లులు పిల్లలకు సమయానికి నిద్ర అలవాటు చేయడం, రాత్రి స్క్రీన్ టైమ్ తగ్గించడం చాలా అవసరం.

జన్యు కారణాలు (Genetics)

కొన్ని కుటుంబాల్లో అమ్మకి లేదా అక్కకి చిన్న వయస్సులోనే మెన్సెస్ వచ్చి ఉంటే, పిల్లలకు కూడా అలానే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా మన చేతిలో ఉండకపోయినా, జీవనశైలితో ప్రభావాన్ని కొంత తగ్గించవచ్చు.

ఈ జనరేషన్ అమ్మాయిలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు అంటే దానికి తల్లితండ్రుల తప్పు ఏమాత్రం లేదు. దీనికి ప్రధాన కారణం ఇప్పుడున్న జీవనశైలిలో వచ్చిన మార్పులే. ఆహారం, నిద్ర, ఆటలు, స్క్రీన్ టైమ్ మారిపోయాయి

అమ్మాయిలు మెచ్యూర్ అయిన సమయంలో వారికి భయం కాకుండా ధైర్యం ఇవ్వాలి. అప్పుడు లేదు. దీనికి ప్రధాన కారణం ఇప్పుడున్న జీవనశైలిలో వచ్చిన మార్పులే. ఆహారం, నిద్ర, ఆటలు, స్క్రీన్ టైమ్ మారిపోయాయి

  • అమ్మాయిలు శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా బలంగా ఎదుగుతారు.
    ఇప్పుడున్న జనరేషన్ మదర్స్ అందరూ పిల్లల కోసం చేయగలిగింది చాలా ఉంది. వీలైనంత వరకు ఇంట్లోనే సిద్ధం చేసిన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి.

  • ముఖ్యంగా సగం వేడి చేసి ఇచ్చే ప్రాసెస్ చేసిన ప్యాకెట్ ఫుడ్స్‌ను దూరంగా ఉంచాలి.
  • పిల్లలకు ఆటలు ఆడుకునే సమయం ఇవ్వాలి, వారి పక్కనే ఉండి గమనిస్తూ ఉండాలి. ఈ రోజుల్లో అమ్మాయిలకు అప్పటిలా భద్రత లేకపోవడంతో, పిల్లల ఆరోగ్యం మాత్రమే కాదు వారి సేఫ్టీ కూడా తల్లుల బాధ్యత.
  • సెల్ ఫోన్లకు దూరంగా ఉంచుతూ, ఆటలు మరియు యాక్టివిటీల్లో ఆసక్తి కలిగిస్తూ, పిల్లలకు మన దగ్గరత్వాన్ని ఇవ్వగలిగితే, అప్పటి మంచి జీవనశైలి కొంతైనా మళ్లీ తీసుకురాగలుగుతాం.

7–8 ఏళ్లకే స్పష్టమైన శారీరక మార్పులు కనిపిస్తే పిల్లల డాక్టర్‌ను సంప్రదించడం మంచిది

ఈ వెబ్‌సైట్ (BeHealth Telugu) లో ఇచ్చే ఆరోగ్య సమాచారం కేవలం సాధారణ అవగాహన (Educational purpose) కోసం మాత్రమే.

Leave a Comment