- ఇప్పుడున్న కాలంలో చిన్న చిన్న విషయాలకే అందరూ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇంట్లో తల్లులైనా, బయట ఆఫీస్‌లో పనిచేసేవారైనా — పెద్దవారు, చిన్నవారు అని తేడా లేకుండా ప్రతి రంగంలోనూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా మనకు తెలియకుండానే ,నెగటివ్‌గా రియాక్ట్ అవుతుంటాం. కానీ ఈ ప్రతిస్పందనలు మన శరీరంలోని అవయవాల మీద ఎంత ప్రభావం చూపుతాయో చాలామందికి తెలియదు. మనం అంచనా వేయలేని విధంగా ఈ స్ట్రెస్ శరీరంలో మార్పులు తీసుకువస్తుంది.
ఇదే కారణంగా ఈ రోజుల్లో పెరిగిపోతున్న గుండె జబ్బులు, రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యలు మరింతగా కనిపిస్తున్నాయి. గుండె సంబంధిత వ్యాధులు పెరగడం కూడా స్ట్రెస్‌నే ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
నిద్ర తగ్గిపోయినప్పుడు శరీరంలో ముందుగా కనిపించే ప్రధాన సమస్యలు:
- మెమరీ ప్రాబ్లమ్స్ — విషయాలు మరచిపోవడం
- స్ట్రెస్ & ఆందోళన పెరగడం
- డయాబెటిస్ ప్రమాదం పెరగడం
- హార్ట్ ప్రాబ్లమ్స్‌కు ప్రారంభ సంకేతాలు
- డైజేషన్ స్లో అవడం & కడుపు సమస్యలు
బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి
ఒత్తిడిని ఎలా నివారించుకోవాలి
ఏ రంగంలోనైనా, ఏ పనిలో అయినా ఒత్తిడి సర్వసాధారణమే. కానీ దాని నుండి బయటపడాలంటే సమస్యను భూతద్దంలో పెట్టి పెద్ద కొండలా ఊహించకుండా, ప్రశాంతమైన మనసుతో చూస్తేనే దానిని సులభంగా ఎదుర్కొని పరిష్కారం కనుగొనగలం.
ప్రతిరోజూ 10–15 నిమిషాలు నిశ్శబ్దంగా శ్వాస వ్యాయామం చేస్తే మెదడు రీలాక్స్ అవుతుంది. రోజువారీ పనులకు చిన్న చిన్న ప్లాన్‌లు చేసుకుంటే గందరగోళం తగ్గి మనసు తేలిక అవుతుంది. ఫోన్, సోషల్ మీడియా వాడకం కొంతసేపు తగ్గించి, ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడటం,తక్కువ కేఫిన్, ఎక్కువ నీరు, పండ్లు—ఇవి శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి.
Stress Control ఒత్తిడిని-ఎలా నివారించుకోవాలి
బాగా స్ట్రెస్‌గా ఉన్నప్పుడు ఒకే ప్రదేశంలో ఎక్కువ సేపు ఉండటం మనసుకు ఇంకా భారంగా అనిపిస్తుంది. అప్పుడు మనకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లడం లేదా మనకు ఇష్టమైన వ్యక్తులతో కొంత సమయం గడపడం చాలా మంచిది. ఇలా చేస్తే మనసుకు ప్రత్యేకమైన అనుభూతి కలిగి, ఒత్తిడి తగ్గి, మనసు కాస్త కుదుటపడుతుంది.
మనకు పెద్ద పని ముందుకొచ్చినప్పుడు అది భయంగా, ఒత్తిడిగా అనిపించడం సహజం. కానీ ఆ పనిని మొత్తం ఒకేసారి చేయాలని ప్రయత్నిస్తే మనసు అలసిపోతుంది. అందుకే పెద్ద పనిని చిన్న చిన్న దశలుగా విభజించండి. ప్రతి దశను పూర్తి చేస్తూ ముందుకు వెళ్తే పని సులభంగా అనిపిస్తుంది. ఒక్కో దశ పూర్తయ్యే కొద్దీ మనకు చిన్న చిన్న విజయాలు లభిస్తాయి. ఇలా చేస్తూ ఉండగా పెద్ద పని పూర్తయిందని కూడా మనకు తెలియకుండా, ఎలాంటి అలసట లేకుండా, ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
స్ట్రెస్ తగ్గించుకోవడానికి మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లడం, మీకు దగ్గరైన వ్యక్తులతో సమయం గడపడం, అలాగే మీకు ఇష్టమైన సంగీతం వింటూ ఉండడం చాలా ప్రభావవంతమైన పద్ధతులు. ఈ చిన్న చిన్న రిలాక్సేషన్ టెక్నిక్‌లు మనసులోని ఒత్తిడిని తగ్గించడంలో, మనసును ప్రశాంతంగా ఉంచడంలో, రోజు మొత్తం పాజిటివ్ ఎనర్జీని పెంచడంలో సహాయపడతాయి