
పిల్లల మెదడుపై సెల్ ఫోన్ ప్రభావం
ఈ రోజుల్లో పిల్లల జీవితంలో సెల్ ఫోన్ ఒక సాధారణ భాగంగా మారిపోయింది.
సెల్ ఫోన్ ఇస్తే ఒక లెక్క, ఇవ్వకపోతే మరో లెక్క అన్నట్టుగా పరిస్థితి తయారైంది, చాలామంది తల్లిదండ్రులు అరగంట మాత్రమే అని అనుకుంటారు.కానీ రోజుకు మూడు సార్లు అరగంట కలిస్తే గంటలుగా మారుతుంది.
జాబ్ చేస్తున్నామనే కారణంతో లేదా బిజీగా ఉన్నామనే కారణంతో,పిల్లలకు సెల్ ఇచ్చి కూర్చోబెట్టడం ఇప్పుడు సాధారణంగా మారింది.ఇది తాత్కాలికంగా కంఫర్ట్ ఇచ్చినా ,దీర్ఘకాలంలో పిల్లల మెదడుకు నష్టం చేస్తుంది,మొదట 10 నిమిషాలు అని మొదలవుతుంది, తర్వాత అరగంట, తర్వాత గంట.తెలియకుండానే పిల్లలు సెల్ ఫోన్‌కు బానిసలవుతారు.
చాలామంది తల్లిదండ్రులు ,ఇతర పిల్లలు చూస్తున్నారు కదా,వాళ్లకు ఏమీ కాలేదు అని అనుకుంటారు. కానీ ప్రతి పిల్లవాడి మెదడు ఒకేలా ఉండదు.
ఎక్కువ సెల్ ఫోన్ వాడకం వల్ల
- ఏకాగ్రత తగ్గుతుంది.
- చిరాకు పెరుగుతుంది.
- చదువుపై ఆసక్తి తగ్గిపోతుంది.నిద్ర సమస్యలు కూడా రావచ్చు.

మన పక్కవాడు మందు తాగుతున్నాడు లేదా సిగరెట్ కాలుస్తున్నాడు అంటే మనం అతన్ని అసహ్యించుకుంటాం, ఇవన్నీ చెడ్డ అలవాట్లే అని అనుకుంటాం, కానీ మనమే పిల్లల చేతిలో సెల్ ఫోన్ పెట్టినప్పుడు అది కూడా ఒక చెడ్డ అలవాటు, ఒక వ్యసనం అనే విషయాన్ని తల్లిదండ్రులుగా మర్చిపోతున్నాం.
చదువు లేదా ఎడ్యుకేషనల్ అవసరాల కోసం రోజుకు అరగంట వరకు పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడంలో తప్పేమీ లేదు, కానీ గేమ్స్ ఆడటానికి, యూట్యూబ్ షార్ట్స్ చూడటానికి, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల పిల్లలకు తాత్కాలికంగా ఆనందం కనిపించొచ్చు గానీ దాని ప్రభావం కళ్లపై, మెదడుపై తీవ్రముగా పడుతుందని చాలా మంది తల్లిదండ్రులు తెలిసినా కూడా తమ సౌకర్యం కోసం, తమ పనుల్లో బిజీగా ఉండటం కోసం “ఈ టైం గడిచిపోతుంది” అనే ఉద్దేశంతో పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు.
ఇది నిజంగా చాలా తప్పు, మీ సమయాన్ని మీ పిల్లలకు ఇవ్వడమే అత్యుత్తమం, ఎందుకంటే తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల భవిష్యత్తును మీ చేతులతోనే నాశనం చేయకూడదు, మీకు వీలైనంత సమయాన్ని పిల్లలతో గడపడం, వారితో మాట్లాడడం, ఆడుకోవడం వాళ్ల జీవితానికి నిజమైన పెట్టుబడి అవుతుంది.

సెల్‌ఫోన్ చూడటం తగ్గించడానికి తల్లిదండ్రులు మీరేం చేయాలి?
ఒకప్పుడు మన పెద్దలకు కళ్లద్దాలు వస్తే అది 50 లేదా 60 సంవత్సరాల వయసులోనే వచ్చేది, కానీ ఈరోజు జనరేషన్‌లో ఐదు నుంచి పది సంవత్సరాల వయసున్న పిల్లలకే కళ్లద్దాలు రావడం మనం చూస్తున్నాం అంటే దాని ప్రభావం కేవలం కళ్లపైనే కాదు, మెదడుపై కూడా ఎంత తీవ్రంగా ఉందో మనకే అర్థమవుతుంది.
ఈ పరిస్థితిని మెల్లగా తగ్గించాలంటే తల్లిదండ్రులుగా మీరు చేస్తున్న పనిని కొంచెం పక్కకు పెట్టి మీ పిల్లలకు సమయం కేటాయించాలి, వారితో మాట్లాడాలి, ఆడుకోవాలి, కలిసి సమయం గడిపే ప్రయత్నం చేయాలి, లేకపోతే వారిని బయట ఆడుకోవడానికి పంపించండి, క్రీడలు, ట్యూషన్స్ లేదా ఇతర మంచి అలవాట్ల వైపు దారి మళ్లించండి, ఎందుకంటే పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఇవ్వడం కంటే మీ సమయాన్ని ఇవ్వడమే వారి కళ్లను, మెదడును, భవిష్యత్తును కాపాడే నిజమైన పరిష్కారం.
పిల్లలు సడన్‌గా సెల్ ఫోన్ లాగేసుకుంటే, పిల్లలు ఇరిటేషన్ అవుతారు వారికి కోపం ఎక్కువ అయిపోతుంది దాని ప్రభావం అనేది మెదడు మీద పడి వాళ్ళు వస్తువులను విసిరివేసే అవకాశం ఉంది, కోపంలో వాళ్ళు మనల్ని ఏదైనా అనవచ్చు కూడా అందుకే ఒక దారిలో తీసుకెళ్లాలి అంటే మనము పిల్లలకి ఒక నెమ్మదిగా వారిని కంట్రోల్ చేయాలి ఒకేసారి కంట్రోల్ చేయడం వల్ల వారు వినరు మనం గట్టిగా ఇంకా గట్టిగా అరవడం చేస్తుంటారు .
రోజుకు గంటల తరబడి పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా పూర్తిగా తీసేయకుండా ముందుగా ఒక నిర్ణయం తీసుకోవాలి, ఈ సమయం వరకు మాత్రమే సెల్ చూడాలి అని పిల్లలకు ముందే స్పష్టంగా చెప్పాలి మరియు రోజూ కొద్దికొద్దిగా ఆ సమయాన్ని తగ్గించుకుంటూ రావాలి, అదే సమయంలో సెల్ ఇచ్చే టైమ్‌లోనే వారి మనసును వేరే విషయాల వైపు మళ్లించాలి వారిని బయటికి తీసుకెళ్లి ఆడించండి, ఏదైనా ఆక్టివిటీలో పాల్గొనేటట్టు చేయండి, డ్రాయింగ్ వేయించండి లేదా బుక్స్ చదవమని ఇవ్వండి, తోటి పిల్లలతో కలిసి ఆడుకునే అవకాశాలు కల్పించండి, అలాగే సెల్ తగ్గిస్తూనే టీవీ అలవాటును కూడా నెమ్మదిగా దూరం చేస్తూ ఇతర మంచి అలవాట్లలో పిల్లలను నిమగ్నం చేయాలి, ఎందుకంటే ఏ అలవాటు అయినా తీవ్రమైన స్థాయికి వెళ్లే ముందు చిన్న దశలోనే తగ్గించడం ఉత్తమం, మన జీవితంలో ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించడం, వారికి హాని కలిగించే వాటి నుంచి దూరంగా ఉంచడమే తల్లిదండ్రులుగా మనం చేయగలిగే అత్యుత్తమ పని.