రాత్రి నిద్ర పట్టకపోతే ఏం చేయాలి?

రాత్రి నిద్ర పట్టకపోవడం ఎందుకు జరుగుతుంది

రోజంతా పని చేసి అలసిపోయిన రాత్రి నిద్ర పట్టకపోతే శరీరానికి సరైన విశ్రాంతి ఉండదు,రాత్రి నిద్ర ఒక వ్యక్తికి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి, కానీ కొంతమందికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు, కళ్లు మూసుకుని పడుకున్నా ఆలోచనలు ఆగవు.

మరికొంతమంది మధ్యమధ్యలో తరచూ మేల్కొంటూ నిద్రలేమితో బాధపడతారు,రాత్రి నిద్ర పట్టకపోవడం ఈ రోజుల్లో చాలామందికి ఎదురవుతున్న సాధారణ సమస్య,

కొంతమందిలో తెలియకుండానే డిప్రెషన్, నిద్రలేమి (Insomnia) వంటి సమస్యలు ఉంటాయి. ఇవి నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయి. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే నిద్ర సమస్య మరింత తీవ్రమవుతుంది.

రాత్రి నిద్ర పట్టకపోవడం ఎందుకు జరుగుతుంది?

మానసిక-ఒత్తిడి-మరియు-ఆందోళన
మానసిక-ఒత్తిడి-మరియు-ఆందోళన

నిద్ర సరిగా లేకపోతే మరుసటి రోజు శరీరం అలసిపోయినట్టుగా అనిపిస్తుంది, చిరాకు పెరుగుతుంది, పనిపై దృష్టి తగ్గుతుంది, దీర్ఘకాలంగా నిద్రలేమి కొనసాగితే రోగనిరోధక శక్తి తగ్గడం, గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు మరియు మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు.

ప్రతి వ్యక్తికి నిద్ర పట్టే సమయం వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్దవాళ్లకు రాత్రి పడుకున్న తర్వాత 10 నుంచి 20 నిమిషాల్లో నిద్ర రావాలి. 30 నిమిషాలకంటే ఎక్కువ సమయం పడితే అది ఒత్తిడి లేదా నిద్రలేమికి సంకేతం కావచ్చు. అలాగే తల దిండు తాకగానే నిద్రపోతే, అది సరిపడ నిద్ర లేకపోవడం వల్ల కూడా కావచ్చు.

చాలా మంది రాత్రిపూట కాఫీ లేదా టీ తాగుతారు. ఈ పానీయాల్లో ఉండే కెఫీన్ నిద్రను అడ్డుకుంటుంది. అలాగే నిద్రకు ముందు మొబైల్ వాడటం వల్ల మెదడు చురుకుగా మారి నిద్ర పట్టదు. ఈ అలవాట్లు నిద్ర నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

రాత్రి త్వరగా నిద్ర పోవాలంటే?

  • ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం శరీరానికి మంచి అలవాటు.
  • నిద్రకు కనీసం ఒక గంట ముందు మొబైల్, టీవీ వాడకాన్ని తగ్గించాలి. ఇది మెదడును ప్రశాంతపరుస్తుంది.
  • రాత్రి పడుకునే రెండు మూడు గంటల ముందు కాఫీ, టీ తాగకుండా ఉండటం మంచిది. అవసరమైతే గోరువెచ్చని పాలు తాగవచ్చు.
  • పడుకునే ముందు కొన్ని నిమిషాలు లోతుగా ఊపిరి పీల్చడం వల్ల ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
  • నిద్ర గది చీకటి, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి,
  • ఎక్కువ వెలుతురు లేదా శబ్దం నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
  • నిద్ర అనేది శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు, ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన ప్రక్రియ. రోజుకు 7–8 గంటల నిద్ర పెద్దలకు చాలా అవసరం. సరైన నిద్ర ఉంటే శరీరం చురుకుగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు రోజువారీ పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది.

రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం సాధారణ సమస్య లాగే అనిపిస్తుంది కానీ రోజు ఇలాగే జరిగితే మాత్రం వెంటనే డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది

Leave a Comment