పిల్లల లంచ్ కి ప్లాస్టిక్ బాక్సులు, బాటిల్స్ వాడుతున్నారా ?

పిల్లల లంచ్ కి ప్లాస్టిక్ బాక్సులు, బాటిల్స్ వాడుతున్నారా

 

పిల్లల లంచ్ కి ప్లాస్టిక్ బాక్సులు, బాటిల్స్ వాడుతున్నారా

పిల్లల లంచ్ కి ప్లాస్టిక్ బాక్సులు, బాటిల్స్ వాడుతున్నారా ?

ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల స్కూల్ లంచ్‌కు ప్లాస్టిక్ బాక్సులు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు ఉపయోగిస్తున్నారు. ఉదయం పూట స్కూల్ కి టైం అవుతుందని తొందరలో వేడి వేడి అన్నం, కూరలు వెంటనే ప్లాస్టిక్ లంచ్ బాక్స్‌లో పెట్టడం, నీటిని ప్లాస్టిక్ బాటిల్‌లో నింపడం సాధారణంగా మారిపోయింది. 

కానీ వేడి ఆహారం, ప్లాస్టిక్‌ను తాకినప్పుడు అందులోని హానికరమైన రసాయనాలు ఆహారంలో కలుస్తాయి. 

ఒకే ప్లాస్టిక్ బాటిల్ లేదా ప్లాస్టిక్ లంచ్ బాక్స్‌ను పదే పదే, కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు వాడడం చాలా ప్రమాదకరం. ఇలా ఎక్కువకాలం వాడినప్పుడు ప్లాస్టిక్ బలహీనమై, అందులో ఉన్న హానికర రసాయనాలు నెమ్మదిగా ఆహారం లేదా నీటిలో కలుస్తాయి.

ముఖ్యంగా ప్లాస్టిక్ లంచ్ బాక్స్‌లో పప్పు, అన్నం, కూరలు వంటి ఆహారం పెట్టడం మరింత హానికరం. చాలామంది “బాక్స్ బాగానే ఉంది” అని అనుకుని సంవత్సరాల పాటు వాడుతుంటారు. కానీ ప్లాస్టిక్ లంచ్ బాక్స్ ఆహారానికి వాడటమే ప్రమాదకరమైతే, నాణ్యత లేని (చీప్) ప్లాస్టిక్‌ను వాడితే ప్రమాదం ఇంకా ఎక్కువ.

 

 

పిల్లల లంచ్ కి ప్లాస్టిక్ బాక్సులు, బాటిల్స్ వాడుతున్నారా 2

ఎప్పుడో ఒకసారి బయట నుంచి తెచ్చుకునే ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్లలో ఉండటం వల్ల ప్రమాదం ఉంటుందని చాలామందికి తెలుసు, వేడి వేడి ఆహారం ప్లాస్టిక్‌ను తాకినప్పుడు అందులోని రసాయనాలు నెమ్మదిగా ఆహారంలో కలుస్తాయి. కానీ ఇది ఎప్పుడో ఒకసారి మాత్రమే కాబట్టి చాలామంది పెద్దగా పట్టించుకోరు, రోజూ ఇలా తినం కదా అని భావిస్తారు.కానీ మన కళ్లకు కనిపించని మరో పెద్ద ప్రమాదం ఇంట్లోనే జరుగుతోంది.

  మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అని నమ్మి, వేడి అన్నం లేదా వేడి కూరలను అందులోనే పెట్టి ఇస్తున్నా,. ఇలా రోజూ జరిగితే ప్లాస్టిక్‌లోని రసాయనాలు ఆహారాన్ని కలుషితం చేసి, పిల్లల ఆరోగ్యంపై మెల్లగా చెడు ప్రభావం చూపుతాయి.

 

పిల్లల లంచ్ కి ప్లాస్టిక్ బాక్సులు, బాటిల్స్ వాడుతున్నారా 7

ప్లాస్టిక్‌లో వేడి పాలు / వేడి అన్నం / వేడి

నీరు పెట్టినప్పుడు ఏమవుతుంది?

ప్లాస్టిక్ బాటిళ్లు లేదా లంచ్ బాక్సుల్లో వేడి పాలు, వేడి అన్నం లేదా వేడి నీరు పెట్టినప్పుడు, ఆ వేడి వల్ల ప్లాస్టిక్‌లో ఉన్న హానికర రసాయనాలు BPA బయటకు వచ్చి ఆహారం లేదా పాలలో కలుస్తాయి, ఆహారం ద్వారా BPA మన శరీరంలోకి వెళ్తుంది.

BPA (బిస్‌ఫెనాల్-A)అనేది ఒక రసాయనం. ఇది ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లు, లంచ్ బాక్సులు, ఫుడ్ కంటైనర్లు, బేబీ బాటిళ్లు తయారీలో ఉపయోగిస్తారు. ఈ రసాయనం వల్ల ప్లాస్టిక్ గట్టిగా, మెరిసేలా ఉంటుంది. బయటికి కనిపించదు కానీ ప్లాస్టిక్ లోపలే ఉంటుంది.

 

ఈ రసాయనాలు పిల్లల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అంటే

పిల్లల శరీరం ఇంకా ఎదుగుదల దశలో ఉంటుంది కాబట్టి, ఈ రసాయనాల ప్రభావం పెద్దలకన్నా ఎక్కువగా పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, హార్మోన్ అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురయ్యే అవకాశం ఉంటుంది

మరి ప్లాస్టిక్ బదులు వేటిని వాడాలి?

ప్లాస్టిక్ స్థానంలో స్టీల్ లేదా గాజు లంచ్ బాక్సులు, స్టీల్ వాటర్ బాటిళ్లు వాడటం చాలు. వేడి ఆహారం కొంచెం చల్లారిన తర్వాతే బాక్స్‌లో పెట్టడం, నీటిని ప్లాస్టిక్‌లో కాకుండా సురక్షితమైన బాటిల్‌లో ఇవ్వడం అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ఈ రోజు మనం తీసుకునే చిన్న నిర్ణయాలే రేపటి మన పిల్లల ఆరోగ్య భవిష్యత్తును నిర్ణయిస్తాయి. 

పిల్లల లంచ్‌కు స్టీల్ (స్టెయిన్‌లెస్ స్టీల్) లంచ్ బాక్సులు చాలా సురక్షితం. ఇవి బలంగా ఉంటాయి, వేడి వల్ల ఎలాంటి రసాయనాలు విడుదల కావు, ఆరోగ్యానికి హాని చేయవు.

నీళ్లు లేదా పాలు తాగడానికి పిల్లలకు స్టీల్ లేదా గ్లాస్ ఉత్తమమైనవి. బయటకు తీసుకెళ్లే సందర్భాల్లో స్టీల్ బాటిళ్లు మరింత సురక్షితం. గ్లాస్ బాటిళ్లు ఇంట్లో వాడుకోవచ్చు. తప్పనిసరిగా ప్లాస్టిక్ వాడాల్సి వస్తే, BPA-Free అని ఉన్న నాణ్యమైన బాటిళ్లనే వాడాలి మరియు వేడి పదార్థాలు మాత్రం ఎప్పటికీ ప్లాస్టిక్‌లో పెట్టకూడదు. ఇలా చిన్న జాగ్రత్తలతో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Leave a Comment