ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా?

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? డాక్టర్లు హెచ్చరిస్తున్న విషయం ఇది!
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? డాక్టర్లు హెచ్చరిస్తున్న విషయం ఇది!

ఉదయం బ్రష్ చేసిన వెంటనే టీ తాగడం చాలా మందికి అలవాటు,కొంతమందికి అయితే టీ తాగకపోతే రోజు మొదలైనట్టే అనిపించదు. ఒక గ్లాస్ టీ తాగిన వెంటనే మైండ్ రిలాక్స్ అవుతుందని, యాక్టివ్‌గా అనిపిస్తుందని వారు భావిస్తారు. అందుకే ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌కి వెళ్లినా, ఎక్కడ టీ దొరికితే అక్కడ టీ తాగుతూ ఉంటారు.

కొంతమంది ఉదయం ఖాళీ కడుపుతోనే కాదు, బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కూడా పలుసార్లు టీ తీసుకుంటారు, టీ లేకపోతే కొందరిలో చిరాకు, అసహనం కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఖాళీ కడుపుతో తరచూ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు కడుపుపై ప్రభావం పడుతుంది. టీ లో ఉండే కెఫిన్  (Caffeine) కడుపులో ఆమ్లాన్ని (Acid) పెంచుతుందిదాంతో కొంతమందికి గ్యాస్, అజీర్ణం, ఛాతిలో మంట, కడుపు మంట వంటి సమస్యలు రావచ్చు,ముఖ్యంగా గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ఇబ్బంది కలిగిస్తుంది.

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

టీ లో ఉండే టానిన్స్ (Tannins) అనే పదార్థాలు ఆహారంలో ఉన్న ఐరన్ శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి.

రోజూ ఇలా ఖాళీ కడుపుతో టీ తాగడం అలవాటైతే, అది క్రమంగా మానసిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

ఆకలిని తగ్గిస్తుంది బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసేటట్టు చేస్తుంది దీనివల్ల ఛాతికి గ్యాస్ ట్రబుల్ లా అనిపించి గ్యాస్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది

ఖాళీ కడుపున టీ తాగుతున్నారా?
ఖాళీ కడుపున టీ తాగుతున్నారా

నిజం చెప్పాలంటే టీ మనల్ని బానిసలుగా చేయలేదు, మనమే దానికి అలవాటు పడిపోయాం, రోజూ ఒకే టైమ్‌కు టీ తాగడం వల్ల అది మన జీవన విధానంలో భాగంగా మారింది.

అందుకే టీ లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా, మైండ్ పనిచేయనట్టుగా ఫీలవుతాం,ఇది టీ ప్రభావం కాదు, మన మైండ్ ఏర్పరుచుకున్న అలవాటు మాత్రమే.

ఈ అలవాటును కొంచెం కొంచెంగా మార్చుకుంటే, అంటే ఉదయం నీళ్లు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం, మంచి నిద్ర పాటించడం లాంటి చిన్న జీవనశైలి మార్పులు చేసుకుంటే, మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది, మైండ్ కూడా సహజంగానే ఫ్రెష్‌గా పని చేస్తుంది.

టీ తాగితేనే మైండ్ పని చేస్తుందన్నది నిజం కాదు, కాబట్టి టీ తాగడం తప్పు కాద,. కానీ టీ లేకపోతే నా మైండ్ పనిచేయదు అనే ఆలోచనను మార్చుకోవడం అవసరం.

ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడం చాలా మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది

నీళ్లలో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలిపుకోవచ్చు,ఆ తర్వాత కొద్దిసేపటికి ఫలాలు, డ్రై ఫ్రూట్స్ లేదా లైట్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న తర్వాత టీ తాగితే ఎలాంటి సమస్య ఉండదు.


బి హెల్త్ తెలుగు

Leave a Comment